హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్‌కు వందేభారత్ రైలును ప్రధాని మోదీ రేపు (16న) వర్చువల్‌గా నాగ్‌పూర్‌లో ప్రారంభించనున్నట్టు అధికారులు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రైలు సోమవారం సాయంత్రం 4.15కు నాగ్‌పూర్ నుంచి బయలు దేరి రాత్రి 11.25 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందన్నారు.