హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం బిల్లు ప్రవేశపెట్టడం స్వాగతిస్తున్నట్టు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తెలిపారు. బిల్లులో ఓబీసీ కోటా లేకుంటే అన్యాయమేనని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని జాతీయ బీసీదళ్ కేంద్ర కార్యాలయంలో బీసీదళ్, బీసీ మహిళా సంఘం సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని కోరారు.