Vaikunta Ekadashi | యాదగిరి గుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం గుండా నరసింహుడి దర్శనం
Vaikunta Ekadashi | యాదగిరిగుట్టలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలను వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 6:48 గంటలకు ప్రధానాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. పాతగుట్ట లక్ష్మీనారసింహుడు ఉత్తర రాజగోపురం గుండా 6:42 గంటలకు వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చారు.
Vaikunta Ekadashi | యాదగిరిగుట్టలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలను వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 6:48 గంటలకు ప్రధానాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. పాతగుట్ట లక్ష్మీనారసింహుడు ఉత్తర రాజగోపురం గుండా 6:42 గంటలకు వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చారు. ఆలయ చరిత్రలో యాదగిరీశుడు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిస్తుండటంతో భక్తుల నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మార్మోగుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు ఉత్తర ద్వారం గుండా దర్శనం అనంతరం.. స్వామివారిని ఆలయ ముఖ మండపంలో వేంచేపు చేసి సాయంత్రం వరకు ఉత్తర ద్వారం గుండా భక్తులకు అనుమతినిచ్చి దర్శన భాగ్యం కల్పించనున్నారు.
కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ వేళల్లో మార్పులు చేసినట్టు ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు చెప్పారు. స్వామివారి బ్రేక్ దర్శనం ఉదయం 9 గంటలకు ఉండగా.. ఆ సమయాన్ని 11 గంటలకు మా ర్చినట్టు వెల్లడించారు. భక్తులతో నిర్వహించే పలు కార్యక్రమాలను రద్దుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

