హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా, వీఐపీ బ్రేక్ దర్శనాలను 10 రోజులపాటు రద్దు చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. గోవింద మాలధారులకు కూడా ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవని తెలిపారు. టోకెన్లు ఉన్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మొదటిరోజు మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లకు వైకుంఠ ఏకాదశి రోజున దర్శన అనుమతులు ఉండవని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (టీఈసీడబ్ల్యూ ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా జీసీరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో నూత న కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎం శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా ఏ మహేందర్, పెద్ద పుల్లారావు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.