OU Doctorate | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో వడిత్యా రాజు నాయక్ డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ బ్రహ్మానందం పర్యవేక్షణలో ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ : ఎ స్టడీ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి రాజు నాయక్ సమర్పించిన పరిశోధనా గ్రంధాన్ని పరిశీలించిన ఓయు ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరి గూడెం మండలం నంద్యా తాండకు చెందిన రాజు నాయక్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, విద్యార్థి నాయకులు అభినందించారు.