గడ్డి మందును నిషేధించండి
అనేక అనర్థాలు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణంగా మారిన ‘పారాక్వాట్ డైక్లోరైడ్' అనే గడ్డి మందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర మంత్రి శివరాజుసింగ్ చౌహాన్‌ను కోరారు.
- ఆత్మహత్యలు జరుగకుండా చూడండి.. కేంద్రానికి వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): అనేక అనర్థాలు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణంగా మారిన ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ అనే గడ్డి మందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర మంత్రి శివరాజుసింగ్ చౌహాన్‌ను కోరారు.
కేంద్ర మంత్రిని గురువారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేశారు. గడ్డి మందు వల్ల జరుగుతున్న అనర్థాల గురించి మంత్రికి వివరించారు. విషపూరితమైన ఈ గడ్డి మందును నిషేధించి, ఆత్మహత్యలు జరుగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సంప్రదింపుల కమిటీ భేటీకి హాజరు
బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల కమిటీ చైర్మన్, ఆ శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం పార్లమెంట్ అనెక్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
గడ్డిమందు నిషేధానికి కృషి: కోదండరెడ్డి
ప్రమాదకరమైన గడ్డిమందు, కలుపు మందుల నిషేధంపై అసెంబ్లీలో చర్చించేందుకు కృషి చేస్తామని రైతు కమిషన్ చైర్మన్ ఏ కోదండరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం, స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రికి నివేదిక ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

