కేసముద్రం, డిసెంబర్ 15: మున్నూరుకాపులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలో ఆదివారం ఎంకే కన్వెన్షన్ హాల్‌ను ప్రారంభించి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ మున్నూరుకాపులను గుర్తించి పది మందికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు కేటాయించారని గుర్తుచేశారు.
మున్నూరుకాపులు ఐక్యంగా ఫంక్షన్‌హాల్ నిర్మించుకోవడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మహబూబాబాద్, వరంగల్ తూర్పు, పశ్చిమ మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, నన్నపునేని నరేందర్, దాస్యం వినయభాసర్, రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, నాయకులు పాల్గొన్నారు.