హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ప్రధాన ప్రతిపక్షాన్ని, రిటైర్డ్ ఇంజినీర్లను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హేయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాననే ఆలోచన కూడా లేకుండా, రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడడం శోచనీయమని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇకనైనా నోటికొచ్చినట్టు మాట్లాడడం మాని, రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.