సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల వడ్డెర సంఘం నాయకులు మంత్రి కేటీఆర్‌కు మద్దతు ప్రకటించారు. ఆదివారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇంపీరియల్ గార్డెన్లో సమావేశమైన వీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ‘మా ఓటు రామన్నకే’ అంటూ ప్రమాణం చేయడంతోపాటు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ నామినేషన్ ఖర్చు కోసం రూ.10,116లను బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్‌కు అందజేశారు.