హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో మార్చి నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎస్సీలకు సంబంధించిన 64 కేసులను విచారించి పదకొండింటిని పరిష్కరించామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడలోని దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసు అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేశామని పేర్కొన్నారు.
ఆయన భార్యకు వరంగల్‌లో ఉద్యోగం, రూ. 8.25 లక్షల నష్టపరిహారం, తల్లికి ప్రతినెలా రూ.5000 పింఛన్, పిల్లలకు కార్పొరేట్ విద్య అందించాలని డీజీపీ, అదనపు డీజీపీలను ఆదేశించామని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన ఎస్సీ కమిషన్‌కు సివిల్‌కోర్టు అధికారాలు ఉంటాయని చెప్పారు. భూకబ్జాలు, లైంగికదాడులు, హత్యలు తదితర విషయాల్లో అన్యాయానికి గురైన దళితులు జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువస్తే విచారించి పరిష్కరిస్తామని వెల్లడించారు.