ఆరుసార్లు గెలిపించినం. రాష్ట్రం అచ్చినంక రెండుసార్లు మంత్ర య్యిండు. అందుల ఓ సారి పైసల మంత్రిగా చేసే. ఆయన చేతుల్నే అంతుండే. కానీ, ఒక్కరోజు కూడా ఇల్లందకుంట సీతారామచంద్రస్వామిని పట్టించుకోలే. ఆయనకు కొబ్బరికాయిత్తే ఎటో సూత్తడు. దేవుడి మీద భక్తి ఉండదు. గా రేకుల షెడ్డు ఒక్కటే తెచ్చిండు. కట్టిచ్చిండు. ఇగ ఎప్పటికి వచ్చేది.. పోయేది.. అంతా షోనే. ఇంక ఆలయాన్ని బాగా అభివృద్ధి చేస్తా.. భద్రాద్రిగా తీర్చిదిద్దుతా.. అంటూ ఎన్నోసార్లు పేపరోళ్లకు చెప్పుడు. వాళ్లు రాసుడు. ఇవే జరిగినయ్. – నన్నబోయిన రవి యాదవ్, లక్ష్మాజీపల్లి గ్రామస్తుడు
ఆయన చేసిందేమీ లేదు..
రాష్ట్రం అచ్చినంక ఆర్థిక మంత్రిగా పనిజేసిండు. ధనిక రాష్ట్రం అయ్యే. సీతారామలక్ష్మణులు ఇక్కడ తిరిగిన్రు. భద్రాద్రి కంటే గొప్ప పుణ్యక్షేత్రం ఇది. ఎట్లా అభివృద్ధి చేయనుండే. కోట్లుబెట్టి గొప్పగా కట్టించనుండే. కోనేరుకే రోడ్డు లేదు. ఇగ ఏంజెత్తడు. ఒక్క రోజు పట్టించుకోలే. ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినం. పట్టించుకోలే. అదోలాగా మాట్లాడెటోడు. దాతలు పైసలిచ్చిన్రు. వాళ్ల పేర్లు కూడా ఎక్కడా చెప్పరు. అన్నం వ్యాపారులే పెడ్తరు. – సచిన్‌రెడ్డి, ఇల్లందకుంట మాజీ ఎంపీటీసీ
మంత్రి హరీశ్‌రావు 10కోట్లిత్తమన్నడు..
ఆలయ అభివృద్ధి అంతంత మాత్రమే. ప్రభుత్వం, దాతలు కొంత చేసిన్రు. మొన్న మంత్రి హరీశ్‌రావు మీటింగ్ ఇక్కడబెట్టిండు. టెంపుల్‌కు 10కోట్లిస్తమన్నడు. ఇగ అవిత్తే చాలు. గుడి దేదీప్యమానంగా వెలుగిపోతది. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుంటుంటది. ఎంతలేదన్నా.. వంద రూంలు కట్టాలే. గుడిని గొప్పగా నిర్మాణం చెయ్యాలే. అపర భద్రాద్రిగా ఏర్పాట్లు చేయాలే. – శేషం రామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకుడు.