1.62 లక్షల పైకి పుత్తడి
బంగారం మళ్లీ పుంజుకుంటున్నది. గురువారం ఒకేరోజు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.4,300 ఎగబాకి మూడు నెలల గరిష్ఠ స్థాయి రూ.1.62 లక్షలు దాటింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.1,62,300 వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారం మళ్లీ పుంజుకుంటున్నది. గురువారం ఒకేరోజు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.4,300 ఎగబాకి మూడు నెలల గరిష్ఠ స్థాయి రూ.1.62 లక్షలు దాటింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.1,62,300 వద్ద ముగిసింది. డాలర్ బలహీనపడటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు ఇది రూ.1.58 లక్షలుగా ఉన్నది.
మే 26న ముగిసిన రూ.1.62,400 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి రూ.10 వేలు ఎగబాకి ఏడు వారాల గరిష్ఠ స్థాయి రూ.2.45 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.2.35 లక్షలుగా ఉన్నది. డాలర్ బలహీనపడటం, ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుముఖం పట్టడం వల్లనే అతివిలువైన లోహాల ధరలు మూడు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 66.31 డాలర్లు తగ్గి 4,456.72 డాలర్లకు పడిపోగా, వెండి 2 శాతం దిగి 65.82 డాలర్లకు దిగొచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

