కంఠేశ్వర్, ఆగస్టు 20 : కాంగ్రెస్ పార్టీలో ఒక విధానమంటూ ఉంటు ంది.. దాని ప్రకారమే నడుస్తుంది.. ఎమ్మెల్యే టికెట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినా చెల్లదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టంచేశారు. ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తేల్చిచెప్పారు. గురువారం నిజామాబాద్‌లో విలేకరుల వద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత కామెంట్స్‌పై స్పందిస్తూ.. ‘ఆమె వ్యాఖ్యలు బాధాకరం.. తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇప్పటికే కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. ఆమె మంత్రి పదవిలో ఉన్నందున వివరణ కోరాం. వివరణ ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుం టా ం’ అని తెలిపారు. చిన్నారెడ్డి సీనియర్ నాయకుడు, పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టంచేశారు.