INDW vs SLW : మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు వేళైంది. ఎనిమిదో టైటిల్‌పై గురి పెట్టిన టీమిండియా టైటిల్ పోరులో శ్రీలంకను ఢీకొడుతోంది. గత సీజన్లో లంక చేతిలో ఓడి కప్‌ను చేజార్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఈసారి ప్రతీకార విజయంపై కన్నేసింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్ తీసుకుంది. ఇరుజట్లు తమ తుది జట్టులో రెండు మార్పులు చేశాయి.
అజేయంగా మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు రికార్డు టైటిల్ లక్ష్యంగా ఆడనుంది. రెండేళ్ల క్రితం టీమిండియాను ఓడించిన తొలిసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన శ్రీలంక ట్రోఫీ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లు లీగ్ దశలో అద్భుతంగా ఆడడంతో విజేత ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది. కీలకమైన మ్యాచ్ కావడంతో ఇరుజట్లు రెండు మార్పులతో ఆడుతున్నాయి. ప్రతీకా రావల్ స్థానంలో జి.కమలిని ఎంపికవ్వగా.. విష్మీ గుణరత్నేను తీసుకుంది లంక.
#TeamIndia‘s Playing XI for the Final 🙌
Updates ▶️ https://t.co/knKLXGSfOd #WomensAsiaCup | #INDvSL pic.twitter.com/pCAJowNL2y
— BCCI Women (@BCCIWomen) September 13, 2026
భారత తుది జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జి.కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతి ఫుల్మాలి, రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.
శ్రీలంక తుది జట్టు: చమరి ఆటపట్టు(కెప్టెన్), ఇమేష దులానీ, విష్మీ గుణరత్నే, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షిక సిల్వా, కౌశాని నుత్యంగన(వికెట్ కీపర్), సుగంధిక కుమారి, చముడి ప్రబోద, మిథాలీ అయోధ్య.