ICET | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఎంబీఏలో 2,933, ఎంసీఏలో 1,088 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 4,021 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఐసెట్‌లో స్పెషల్ ఫేజ్ సీట్లను శుక్రవారం కేటాయించారు. ఈ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఎంబీఏలో 28,623 సీట్లకు 25,690(89.8శాతం), ఎంసీఏలో 6,966 సీట్లకు 5,878(84.4శాతం) సీట్లు భర్తీ అయ్యినట్టు అధికారులు ప్రకటించారు. 7లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
నేటితో ముగియనున్న డీఎస్సీ వెరిఫికేషన్
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2024 సర్టిఫికెట్ వెరిఫికేషన్ శనివారంతో ముగియనున్నది. 1:3 జాబితాలోని వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ శనివారంతో పూర్తికానుంది. అనంతరం 1:1 చొప్పున సెలెక్షన్ లిస్టును ప్రకటిస్తారు. జాబితాలో ఉన్న వారికి 9న ఎల్బీస్టేడియంలో నియామకపత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
ఇంటర్‌లోనూ మిగులు అధ్యాపకుల సర్దుబాటు
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని మిగులు అధ్యాపకులను ఇం టర్ విద్య కమిషనరేట్ సర్దుబాటు చే సింది. 20 మంది జూనియర్ లెక్చరర్ల ను మరో కాలేజీలో సర్దుబాటు చేశా రు. పలు కాలేజీల్లో మిగులు అధ్యాకులను అధ్యాపకులు లేని కాలేజీలకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు.