ఈ ఏడాది ఎంబీఏలో 2,933, ఎంసీఏలో 1,088 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 4,021 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఐసెట్‌లో స్పెషల్ ఫేజ్ సీట్లను శుక్రవారం కేటాయించారు.
ఇంజినీరింగ్ తర్వాత అత్యధిక డిమాండ్ ఉండేది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకే. రాష్ట్రంలో ఈ ఏడాది 264 కాలేజీల్లో 33, 620 ఎంబీఏ, 65 కాలేజీల్లో 6,162 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి.