హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : జాతీయ స్థాయిలో పామ్బోర్డు ఏర్పాటుచేసి ఆయిల్‌పామ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు. పామ్ చెట్ల నుంచి బెల్లం, ఇతర ఉప ఉత్పత్తులను తయారుచేసి వాటితో పిల్లలకు ఆరోగ్యకరమైన చాక్లెట్లు, బిసెట్లు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు తయారు చేయాలని కోరారు. ఢిల్లీలో అఖిల భారత గౌడ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఆలిండియా కలాల్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ రంగం ప్రధానంగా కులవృత్తులపై ఆధారపడి నడుస్తున్నందున దీనిని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నీరా కేఫ్‌లు, ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుతోపాటు వైన్‌షాపుల్లో రిజర్వేషన్లు, ఎక్స్‌గ్రేషియా పం పిణీ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు శ్రీనివాస్‌గౌడ్‌ను నేపాల్ ప్రతినిధులు, అఖిల భారతీయ కల్వార్ కలాల్ మహాసభ సభ్యులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బ్లోగట్ కిశోర్‌కుమార్ భగత్, అధ్యక్షుడు మనీశ్‌రాయ్, ప్రధాన కార్యదర్శి కిశోర్భగత్, కోశాధికారి శివప్రసాద్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): దళిత క్రైస్తవుల అంశంపై సుప్రీంకో ర్టు ఇచ్చిన తాజా తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ పేర్కొన్నారు. ఈ తీర్పు భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హకు, మత స్వేచ్ఛ హకు ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నదని, ఈ తీర్పు పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఈ తీర్పుతో మత మార్పిడి చేసిన దళితులకు చట్టపరమైన రక్షణ తగ్గిపోవచ్చని మంగళవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ము ఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఇది సామాజిక న్యాయం, సమానత్వం అనే రాజ్యాంగ ప్రాథమిక విలువలను బలహీనపరచే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసి ఈ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.