సబ్బండ వర్ణాలకు సమన్యాయం
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సబ్బండ వర్ణాలకు సమన్యాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రశంసించారు.
- ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సొంతం
- ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రమణాచారి
- అర్చక సంక్షేమ బోర్డు సభ్యులకు సన్మానం
సుల్తాన్‌బజార్, జూలై 15: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సబ్బండ వర్ణాలకు సమన్యాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రశంసించారు. ఇటీవల తెలంగాణ అర్చక సంక్షేమ బోర్డు సభ్యులుగా నియమితులైన కాండూరి కృష్ణమాచారి, చిలకమర్రి శ్రావణ్ కుమారాచార్యులు, నారాయణస్వామి శుక్రవారం రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులుతో కలిసి డాక్టర్ రమణాచారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన అర్చక సంక్షేమ బోర్డు నూతన సభ్యులను సన్మానించి, ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో అర్చక, ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎనలేని కృషిచేస్తున్నారని కొనియాడారు. అర్చక సంక్షేమ బోర్డు ఏర్పాటుతో ప్రస్తుతం రాష్ట్రంలోని దేవాదాయ ఉద్యోగులు అనేక ప్రయోజనాలను పొందుతున్నారని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్చకులు, దేవాదాయ ఉద్యోగులకు జీతభత్యాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో దేవాదాయ ఉద్యోగుల జేఏసీ సభ్యులు చింతపట్ల బద్రీనాథాచార్యులు, ఏ చంద్రశేఖర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

