KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అఖిలేష్ యాదవ్ ఫోన్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు.
కేసీఆర్కు హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు. 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరమని వైద్యులు పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. త్వరితగతిన కోలుకోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందన్నారు వైద్యులు. మానసికంగా కూడా కేసీఆర్ దృఢంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.