హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్‌శక్తిశాఖ ఇటీవల అక్షింతలు వేసిన నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంలో ఎట్టకేలకు కదిలిక వచ్చింది. ప్రాజెక్టు పనులపై దృష్టి సారించింది. కేంద్రం అమలుచేస్తు న్న ఏఐబీపీ స్కీమ్ పరిధిలోని తెలంగాణ ప్రాజెక్టుల పురోగతిపై జల్‌శక్తి శాఖ ఢిల్లీ లో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహి ంచింది. ముఖ్యంగా దేవాదుల పురోగతి పై చర్చించింది. గడువు దాటినా ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం, భూసేకరణ పెండింగ్‌లో ఉండటం తదితర అంశాల పై రాష్ట్ర ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఎట్టకేలకు స్పందించింది. తాజాగా ప్రాజెక్టు పనులపై సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక, ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులతో కలిసి సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా సమీక్షించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ దేవాదులను 2027 డిసెంబర్ పూర్తి చేసేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్టు వెల్లడించా రు.
ప్రాజెక్టు పనులు 87.70 శాతం పూ ర్తయ్యాయని, ప్రధాన పంప్‌హౌస్‌లు, పైప్‌లైన్ వ్యవస్థలు, సొరంగం తవ్వకాల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. కాల్వల లైనింగ్, డిస్ట్రిబ్యూటరీ పంపిణీ కాల్వల పనులు, కొన్ని నిర్మాణాల ఆల స్యం, భూసేకరణ సమస్యల వల్లే ప్రాజె క్టు పూర్తిస్థాయి వినియోగాన్ని అడ్డుకుంటున్నాయని పేరొన్నారు. పనుల పూర్తి కి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందని, ఇంకా 2,659 ఎకరాలు సేకరించా ల్సి ఉన్నదని, కోర్టు కేసుల నేపథ్యంలో పెండింగ్ ఉన్నదని తెలిపారు.
కేసులను వెంటనే టోకెన్ దశకు తీసుకెళ్లి పరిహారం చెల్లించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల పట్టణీకరణ నేపథ్యంలో ప్రా జెక్టు ప్రతిపాదిత ఆయకట్టులో సుమారు 39,651 ఎకరాలను తొలగించే ప్రక్రియకు సర్వే కొనసాగుతున్నదని తెలిపారు. నిలిచిన ప్యాకేజీ పనులను గుర్తించాలని, పనులు చేయని కాంట్రాక్టర్ల ఒ ప్పందాలను వెంటనే రద్దు చేసి కొత్త టెం డర్లు పిలవాలని ఆదేశించారు.
2027 డిసెంబర్ 31 నాటికి పనులను పూర్తిచేయడానికి అవసరమైన నిధులు, సాంకేతిక సహాయం, పరిపాలనా అనుమతులన్నీ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు. సమీక్షలో ఎంపీలు బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, మురళీనాయ క్, దొంతి మాధవరెడ్డి, సత్యనారాయణ, రామచంద్రనాయక్, పల్లా రాజేశ్వ్ర్రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సాగునీటి పారుదలశాఖ ప్రధానకార్యదర్శి శ్రీధర్, సహాయకార్యదర్శి కే శ్రీనివాస్, సలహాదారు ఆదిత్యనాథ్దా స్, ఈఎన్సీ శ్రీనివాస్ పాల్గొన్నారు.