ఖైరతాబాద్, డిసెంబర్ 30 : కోదాడ దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్‌డెత్ నిందితులకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి వత్తాసు పలుకుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారుల తీరు ను ఎండగట్టారు. రాజేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించిందని.. ఆలో పే లాకప్‌డెత్ విషయాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.