హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయం తెలంగాణకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంపై హరీశ్‌రావు ప్రజెంటేషన్‌లోని అంశాలన్నీ అవాస్తమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ మేడిగడ్డ అని, ప్రస్తుతం బరాజ్ కూలడంతో ప్రాజెక్టు నిరుపయోగమైందని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద బరాజ్‌ను కడితే ఎల్లంపల్లి దాకా గ్రావిటీతో జలాలు వచ్చేవని, ఆ మేరకు 100 కి.మీ. కాలువలు పూర్తయ్యాయని వివరించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదని వివరించారు.