Rajagopal Reddy | నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : ‘నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేవలం మంత్రులే కాదు.. ముఖ్యమంత్రి స్థాయి ఉన్నవాళ్లు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో అదనపు భవనాల శంకుస్థాపనలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురించి ఏదేదో మాట్లాడటం తగదని అన్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా అసాధ్యులని పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ముందుకు తీసుకుపోతామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ఒక ఆటంకంగా మాత్రమే పరిగణిస్తున్నట్టు చెప్తూ, సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామన్న విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు.