హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను తప్పుపట్టడం సరికాదని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషన్ నివేదికపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కమిషన్ నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిందని, అది రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన రిపోర్టు కాదని వెల్లడించారు. కమిషన్ తేల్చిన విషయాలు, ఇచ్చిన నివేదికపైన అసెంబ్లీలో చర్చిస్తామని, దోషులుగా తేలిన బాధ్యులు.. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కోరారు.