హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ జలదోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శల నేపథ్యంలో జలసౌధలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదీజలాల్లో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలంగాణ జల హకులను కాపాడటంతోపాటు నీటిపారుదల రంగం ఎదురొంటున్న సమస్యల పరిషారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌ను కలిసి సమస్యలను వివరించామని చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేయాలని కోరామని, ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలని, అందుకు టెలిమెట్రీ పరికరాలను అమర్చాలని డిమాండ్ చేశామని వివరించారు.