హైదరాబాద్, జనవరి22 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ రేషన్‌కార్డులను అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సభలు, రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై చర్చించారు.
అనంతరం మాట్లాడుతూ ఈ నెల 26న కొత్త కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని, అర్హులందరికీ కార్డులు అందేవరకు ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. సమావేశంలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.