హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందర్భంగా అభ్యర్థుల ఖరారు కోసం వెళ్తున్న సమయంలో వీరిద్దరూ బేగంపేట విమానాశ్రయంలో ఆత్మీయంగా పలుకరించుకుని, కాసేపు మాట్లాడుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల గురించి డీకేకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి బ్రీఫింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న నైని బొగ్గు కుంభకోణంలోని వాస్తవాలపై డీకే ఆరా తీయడంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు, వ్యూహాల గురించి చర్చించినట్టు సమాచారం. అనంతరం ఈ భేటీపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.