హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గోదావరి నదిపై సమ్మకసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం రాయపూర్‌లో విష్ణుదేవ్ సాయితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణ దిశగా కీలక ముందడుగు పడిందని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాస బాధ్యతను పూర్తిగా తెలంగాణ తీసుకుంటుందని వివరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ పత్రాన్ని సమర్పించినట్టు ఉత్తమ్‌కుమారెడ్డి చెప్పారు.