ఏకీకృత కార్యాచరణతోనే జలభద్రత : ఉత్తమ్
దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జలసంరక్షణ పనినీ ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రతి జలసంరక్షణ నిర్మాణానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలని, నిర్వహణ బాధ్యత సంస్థను స్పష్టంగా నిర్దేశించాలని, తద్వారా కొలువగలిగే ఫలితం సాధించాలని తెలిపారు
హైదరాబాద్, సెప్టెంబర్2 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జలసంరక్షణ పనినీ ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రతి జలసంరక్షణ నిర్మాణానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలని, నిర్వహణ బాధ్యత సంస్థను స్పష్టంగా నిర్దేశించాలని, తద్వారా కొలువగలిగే ఫలితం సాధించాలని తెలిపారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ సుష్మా స్వరాజ్ భవన్లో బుధవారం నిర్వహించిన జల్ సంచయ్-జన్ భాగీదారీ సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. జలభద్రతను కేవలం ఇంజినీర్లు, ప్రభుత్వ శాఖల కార్యక్రమంగానో చూడకూడదని, తాగునీరు, వ్యవసాయ స్థిరత్వం, గ్రామీణ జీవనోపాధులు, పట్టణాల భద్రత, పర్యావరణ పరిరక్షణకు జలభద్రత అత్యంత కీలకమైన ప్రజా ఉద్యమంగా మారాలని పేరొన్నారు. జల సంరక్షణలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు.
కుట్టు మిషన్లకు 1.80లక్షల దరఖాస్తులు
- 15 వరకు గడువు : పొన్నం
హైదరాబాద్, సెప్టెంబర్2 (నమస్తే తెలంగాణ): బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కోసం దరఖాస్తులను ఆహ్వానించగా ఇప్పటివరకు 1,80, 170 అప్లికేషన్లు వచ్చాయని, 15వ తేదీవరకూ ఇంకా గడువు ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కుట్టు మిషన్ల ప్రొక్యూర్ మెంట్‌కు సంబంధించిన షెడ్యూల్, టెండర్ల తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ 7వ తేదీలోగా కుట్టుమిషన్ల ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని, 15 తరువాత ప్రీబిడ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వెయ్యి కంటే తకువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో అవగాహన నిర్వహించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

