హైదరాబాద్, సెప్టెంబర్2 (నమస్తే తెలంగాణ) : ఏరోస్పేస్ రంగంలోకి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ‘రాఘవ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ’ని ప్రారంభించారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని నిర్వహిస్తున్నారు. నిర్మాణ రంగంలో, సాగునీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించారు.
తాజాగా ఏరోస్పేస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి సైతం ఓ డిఫెన్స్ కంపెనీతో సంబంధాలున్నాయని ఇటీవల తీవ్ర చర్చ కొనసాగింది. తాజాగా పొంగులేటి సైతం ఏరోస్పేస్ రంగంలోకి అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.