హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పరీక్షలంటేనే ఎక్కడా లేని టెన్షన్. పైగా ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో కొత్తగా రాసే విద్యార్థులకు భయం వారిని వెంటాడుతూనే ఉంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ విద్యార్థుల్లో ఆన్లైన్ పరీక్షల భయం పోగొట్టమేకాకుండా, వారి సత్తాను పరీక్షించేందుకు సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ఫ్ ఫర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ (సాథీ) పేరిట సెల్ఫ్ అసెస్మెంట్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకురానున్నది. దీనిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ త్వరలోనే ప్రారంభించనున్నట్టు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ శుక్రవారం ట్వీట్టర్లో తెలిపారు. జే ఈఈ, సీయూఈటీ, నీట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల విద్యార్థులకు ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ప్లాట్‌ఫాం మంచి అవకాశమని చెప్పారు. ఐఐ టీ కాన్పూర్ సహకారంతో ఈ ప్లాట్‌ఫాం పోర్టల్‌ను రూపొందించినట్టు పేర్కొన్నారు.
ఎన్నిసాైర్లెనా..
ఆన్లైన్ పోర్టల్ ద్వారా విద్యార్థులు తమకు వీలైన సార్లు మాక్‌టెస్ట్‌లకు హాజరుకావొచ్చు. ఈ పరీక్షలు రాయడం ద్వారా టైమ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ ఫోబియాను దూరం చేసుకోవచ్చు. పరీక్ష ముగియగానే విద్యార్థి సాధించిన స్కోర్ వెబ్సైట్లో ప్రత్యక్షమవుతుంది. ప్రిపరేషన్ లోపాలను అధిగమించవచ్చు. ఏ యే పాఠ్యాంశాలపై దృష్టి పెట్టాలి, పరీక్షల్లో ఎ క్కడ పొరపాట్లు చేస్తున్నామో విద్యార్థులు సొం తంగా అంచనా వేసుకోవచ్చు. టెక్నికల్ కోర్సుల్లోని విద్యార్థుల సత్తాను పరీక్షించుకొనేందుకు ఏఐసీటీఈ కూడా ఇలాంటి పోర్టల్‌ను వినియోగంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.