అమెరికా మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా ట్వీట్
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుపై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసలు కురిపించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంగళవారం మంత్రి కేటీఆర్‌ను ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమె భవిష్యత్తులో కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదంటూ ప్రశంసించారు.
‘20 ఏండ్ల తరువాత కేటీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోకండి. ఇంత స్పష్టత, భావ వ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేనెప్పుడూ చూడలేదు. దావోస్‌లో తెలంగాణ జట్టు దూసుకుపోతున్నది. తెలంగాణకు బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇక్కడి నుంచి తీసుకెళ్లే అవకాశమున్నది. నాకు సిలికాన్‌వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయన బృందం తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో అద్భుతంగా పని చేస్తున్నది’ అని ట్వీట్ చేశారు.