హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) భవనాన్ని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) అధికారులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న పలు నిర్ణయాలను ఎఫ్‌డీఏ అధికారులకు వివరించారు. రిస్క్ బేస్డ్ శాంప్లింగ్, ప్రొపైలిన్ ైగ్లెకాల్ పరీక్షలకు సంబంధించిన పరిశ్రమ, విజిలెన్స్ సెల్, తనిఖీల విధానం వంటి అంశాలపై చర్చించారు. ‘యూఎస్ ఎఫ్‌డీఏ – టీఎస్ డీసీఏ రెగ్యులేటరీ ఫోరం’ కోసం పలు ప్రతిపాదనలు చేశారు.