తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ భేష్
తెలంగాణలో పారిశ్రామిక అనుకూల వాతావరణం చక్కగా ఉన్నదని, అమెరికా సంస్థలు భారతీయ సంస్థలతో కలిసి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని భారత్‌లో అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్ ప్రశంసించారు.
- ఇక్కడ పారిశ్రామిక అనుకూల వాతావరణం
- 6 నెలల్లో యూఎస్ కాన్సులేట్ భవనం పూర్తి
- భారత్ సరిహద్దు వివాదాల్లో తలదూర్చం
- వేగంగా అమెరికా స్టూడెంట్ వీసాల మంజూరు
- భారత్‌లో అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పారిశ్రామిక అనుకూల వాతావరణం చక్కగా ఉన్నదని, అమెరికా సంస్థలు భారతీయ సంస్థలతో కలిసి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని భారత్‌లో అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్ ప్రశంసించారు. తన పర్యటనలో హైదరాబాద్‌లోని అమెరికా వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చించానని, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని అడగగా..ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మంగళవారం బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్‌ను సందర్శించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి టీహబ్‌ను సందర్శించానని, చాలా అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్యానికి హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉన్నదని, గతేడాది అమెరికా సంస్థలు పదుల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. ప్రస్తుతం అమెరికన్ కంపెనీలు తెలంగాణలో సుమారు లక్ష మంది ఉద్యోగులను నియమించుకొన్నట్టు చెప్పారు.
6 నెలల్లో అదనపు సిబ్బంది
భారతీయ విద్యార్థులకు అమెరికా స్టూడెంట్ వీసాలు లభించడంలో జరుగుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని, 6 నెలల్లో కాన్సులేట్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తామని ఎలిజబెత్ జోన్స్ తెలిపారు. గత ఏడాది స్టూడెంట్ వీసాలు పొంది న విదేశీయుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. భారత్‌కు చెందిన సుమా రు 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారని, గత సంవత్సరం దాదాపు 1.25 లక్షల వీసాలు మంజూరు చేశామని వివరించారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న నూతన కాన్సులేట్ భవనం 6 నెలల్లో అందుబాటులోకి వస్తుందని, తద్వారా అదనపు సిబ్బందిని నియమించి వీసా, ఇతర సేవల్లో వేగం పెంచుతామని పేర్కొన్నారు. తెలంగాణపై అమెరికాకు ఉన్న చిత్తశుద్ధికి ఈ భవనం నిదర్శనమని ఎలిజబెత్ జోన్స్ వివరించారు.
సరిహద్దు వివాదాలపై అడిగితేనే సాయం
భారత్‌కు పాకిస్థాన్, చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల్లో తాము సొంతంగా తలదూర్చబోమని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి అంశాల్లో ఏ దేశానికైనా సొంతంగా నిర్ణయం తీసుకొనే అధికారం ఉన్నదని, ఒకవేళ భారత్ కోరితే సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికాలో సుమారు 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక మంది చట్టసభలకు ఎన్నికయ్యారని చెప్పారు. కార్యక్రమంలో యూఎస్ హైదరాబాద్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

