హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు. యూఎస్ కాన్సుల్ జనరల్‌గా కొత్తగా నియమితులైన లారా విలియమ్స్ బుధవారం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
కేటీఆర్‌ను కలిసిన వారిలో న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన అమెరికా మినిస్టర్-కౌన్సిలర్ ఫర్ పొలిటికల్ అఫైర్స్ అరోన్కోప్, ఎకనామిక్ అఫైర్స్ విభాగానికి చెందిన మెరెడిత్ మెట్లర్ తదితరులు ఉన్నారు.