గుండాల, అక్టోబర్ 17 : నెలలు గడుస్తున్నా.. వరి పంట పొట్ట దశకు చేరుకున్నా.. రైతుల యూరియా కష్టాలు మాత్రం తీరడం లేదు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సొసైటీ కార్యాలయం వద్ద రైతులు క్యూలో నిల్చున్నారు. మూడు రోజులకోసారి అరకొరగా యూరియా వస్తుండగా.. అరలోడు మాత్ర మే వచ్చింది.
దీంతో రైతులకు పోలీసు పహారా నడుమ యూరియా పంపిణీ చేయాల్సి వచ్చింది. పొట్ట దశలో ఉన్న వరి పంటకు యూరియా వేయకపోతే దిగుబడులను తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అవసరాలనుబట్టి సరిపడా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.