హైదరాబాద్, ఆగస్టు5 (నమస్తే తెలంగాణ): ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తున్న 213 మంది ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్ మోతి గల్లీలోని మహల్లా ప్యాలస్ ఎదురుగా ఉన్న ఉర్దూ మసాన్ హాల్లో ఆదివారం 213 మంది ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ ఖాజా ముజీవుద్దీన్, డైరెక్టర్ షఫీఉల్లా హాజరుకానున్నారని ఉర్దూ అకాడమీ వెల్లడించింది.