సర్కార్ వంచన ముంచిన వాన.. పూర్తిగా తడిచిన మక్క, వరి ధాన్యం
అకాల వర్షాలు రైతును కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈదురు గాలులకుతోడు వర్షం కురవడంతో ఆరబోసిన మక్కలు, వరి ధాన్యం తడిసిపోయింది.
- రైతును ముంచిన అకాల వర్షం
ధాన్యం కొనకుండా ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబడితే.. మరోవైపు అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వానతో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, ఖిల్లాఘణపురం, కొత్తకోట, రాజోళి, మహబూబ్‌నగర్, నవాబ్‌పేట, ఆత్మకూరులో వడ్లు, మక్కలు నీటిపాలయ్యాయి. వనపర్తి వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం బస్తాల చుట్టూ చేరిన వర్షపునీటిని తోడుతున్న రైతు

మహబూబ్‌నగర్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షాలు రైతును కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈదురు గాలులకుతోడు వర్షం కురవడంతో ఆరబోసిన మక్కలు, వరి ధాన్యం తడిసిపోయింది. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, ఖిల్లాఘణపురం, కొత్తకోట, రాజోళి, మహబూబ్‌నగర్‌లో పంటలు దెబ్బతిన్నాయి. నవాబ్‌పేట, ఆత్మకూరులో వడగండ్లు పడ్డాయి. దీంతో మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు.
కొందరు టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకోగా.. మరికొందరు కవర్లు కప్పేలోగా వర్షార్పణమైంది. కష్టమంతా నీటి పాలైందని దిగాలు చెందారు. యార్డుల్లో వరి, మక్కను 20 రోజులుగా కాపాడుకుంటూ వస్తే.. చివరకు వరుణదేవుడు తమను నిండా ముంచాడని ఆవేదన చెందారు. కాగా పిడుగుపాటుకు నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

