హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): 2047 నాటికి మానవ రహిత వ్యవసాయం అందుబాటులోకి రానున్నదని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థలు, వ్యవస్థలూ మారాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య వెల్లడించారు. ఈ అంశంలో వర్సిటీ నాలెడ్జ్ భాగస్వామిగా ఉండనుందని చెప్పారు. శుక్రవారం వర్సిటీలోని సెమినార్ హాల్లో పరిశోధన, విస్తరణ సలహామండలి 48వ సమావేశం జరిగింది. అధ్యక్ష ఉపన్యాసంలో జానయ్య మాట్లాడుతూ సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, రోబోటిక్ టెక్నాలజీ వినియోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.