Kotha Prabhaker Reddy | సిద్దిపేట : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రభాకర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తప్రసావంతో బాధపడుతున్న ప్రభాకర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.