హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థలం జోలికి రావద్దని వర్సిటీ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. వర్సిటీకి చెందిన పదెకరాల భూమిని జేఎన్ఎఫ్ఏయూకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని కోరింది. ఈ మేరకు భోజన విరామం సమయంలో యూనివర్సిటీలో నిరసన కార్యక్రమం చేపట్టా రు.
ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీ ఉద్యోగ జేఏసీ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, కన్వీనర్ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్, జేఏసీ నేతలు యాకేశ్ దైద, ప్రేమ్‌కుమార్, రవీంద్రనాథ్ సోలమన్, ఎండీ హబీబుద్దీన్, రజనీకాంత్, షబ్బీర్, రాములు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.