న్యూఢిల్లీ: బీహార్ రాజధాని పాట్నాలో ఇవాళ పలు విపక్ష పార్టీ నేతలు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ అంశంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజకీయ పార్టీలు ఒక్కటి కావడం ముఖ్యం కాదు అని, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. ప్రజలంతా ఏకం కావడం ముఖ్యమని కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీల వల్లే దేశంలో సమస్యలు ఉత్పన్నమైనట్లు చెప్పారు. ఒకవేళ విపక్ష పార్టీలన్నీ రాజకీయంగా బీజేపీ వైపో లేక కాంగ్రెస్ వైపో మళ్లితే అప్పుడు దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.
#WATCH | Today, the unity of political parties is not that important, rather it is important to unite people on the issues prevailing in the country. Congress and BJP are responsible for the problems our country is facing today. If political parties unite taking BJP or Congress… pic.twitter.com/5bR25r0fVe
— ANI (@ANI) June 23, 2023
కేంద్రం తీసుకు వచ్చిన యాంటీ ఫెడరల్ బిల్లును ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలపై ముఖ్యంగా ఢిల్లీ ప్రజలపై ఆ బిల్లుతో వత్తిడి తెస్తున్నారని మంత్రి ఆరోపించారు.
#WATCH | Congress has to answer as to why they will not support this anti-federal bill that govt of India is trying to enforce on the people of this nation, especially in the case of Delhi govt: Telangana Minister KTR Rao pic.twitter.com/eCxRumX592
— ANI (@ANI) June 23, 2023