O ROMEO | బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సెన్సేషనల్ బ్యూటీ తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ రోమియో’. ఈ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్, షాహిద్ కపూర్ నాలుగోసారి జతకడుతున్నారు (గతంలో వీరి కాంబోలో కమినే, హైదర్, రంగూన్ వంటి చిత్రాలు వచ్చాయి). ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఈ భారీ యాక్షన్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సినిమాలో షాహిద్ కపూర్ మునుపెన్నడూ లేని విధంగా ఒక ‘వైల్డ్’ లుక్‌లో కనిపించబోతున్నారు. ఒళ్లంతా టాటూలు, రక్తపు మరకలతో ఉన్న ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో తృప్తి దిమ్రితో పాటు నానా పటేకర్, అవినాష్ తివారీ, విక్రాంత్ మస్సే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒక ప్రత్యేక పాత్రలో అలరించనుంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ క్రైమ్ అండ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.