హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎమెర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని కేంద్ర మంత్రు లు కిషన్రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా వారు స్పందించారు. శాశ్వత అధికా రం కోసం ఒక కుటుంబం వికృత కాంక్షను తీర్చేందుకు ఎమెర్జెన్సీ విధించారని మండిపడ్డారు. ఒకరి కుర్చీని కాపాడేందుకు దేశాన్ని జైలుగా మార్చి న వారిని దేశం ఎప్పటికీ మర్చిపోదని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేసి, ప్రజల గొంతును నొక్కేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
మూడు నెలలుగా జీతాలు రావట్లే! ; తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మళ్లీ అదే తీరు
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మళ్లీ మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. గతంలో కూడా మూడు నెలల జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రస్తుతం కూడా తమ జీతాలు సకాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖ వద్ద తమ జీతాల ఫైల్ పెండింగ్లో ఉండటమే ఆలస్యానికి కారణమని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి తమ పెండింగ్ వేతనాల విషయంలో వెంటనే స్పందించాలని 2,600 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.