రామచంద్రాపురం,మే5 : సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారి 65పైన బీహెచ్ఈఎల్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ని సోమవారం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం ఫ్లైఓవర్ పైనుంచి చంద్రానగర్వరకు వెళ్లి యూటర్న్ తీసుకొని రోడ్డు మార్గంలో ఇక్రిశాట్‌కి వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కి వెళ్లారు. ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసేందుకు వచ్చిన స్థానిక బీజేపీ నాయకులకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు కొంత నిరుత్సాహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్లు పుష్పానగేశ్, నాగేందర్‌యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్‌గౌడ్, నాయకులు పాండురంగారెడ్డి, దేవేందర్‌యాదవ్, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రారెడ్డి, ఐల్లేశ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.