చిక్కడపల్లి, జూలై 9: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు సీఎం రేవంత్‌రెడ్డిని విడిచి పెట్టేది లేదని కేంద్ర బొగ్గు, గనులు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాను నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోపిడీ చేస్తున్నదని, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల్లో వేల కోట్లు అప్పులు చేశారని, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేవని పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డులు, రైతులకు రూ.15వేల రైతుభరోసా, మహిళలకు నెలకు 2500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మహి ళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ, ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, కార్పొరేటర్లు రచణశ్రీ, ఉమ రమేశ్‌యాదవ్ పాల్గొన్నారు.