హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రాంచందర్‌రావు ఎన్నికతో కమలం పార్టీలో మొదలై న ముసలం మరింత ముదిరినట్టు కనిపిస్తున్న ది. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యనేతలు డుమ్మా కొట్టడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో కేవ లం కిషన్‌రెడ్డి, డీకే అరుణ, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. గన్‌పార్క్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు నిర్వహించి న ర్యాలీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాత్రమే పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియా సమావేశంలో రామచందర్‌రావు మాట్లాడు తూ.. తామంతా కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, 600 రోజులైనా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ ఆలయం, చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంశం పై భాగ్యలక్ష్మి ఆలయం వద్ద రాంచందర్‌రావు మాట్లాడారు. రాజాసింగ్ వ్యవహారాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక పార్టీని ఎవరు వీడినా నష్టంలేదని స్పష్టంచేశారు. పార్టీని నమ్ముకున్న వారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని, తనకు పదవి దక్కడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
రాష్ట్ర అధ్యక్ష పదవి ఓసీకి ఇచ్చి, బీసీలను బీజేపీ పక్కనపెట్టిందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై రాంచందర్‌రావు మండిపడ్డారు. స్టేట్ చీఫ్‌గా తనకు అవకాశం ఇచ్చినంతమాత్రాన బీసీలను పక్కన పెట్టారంటూ ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ బీసీ అని, బీసీలే తమ పార్టీ ఓటు బ్యాంకు అని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి బీసీని సీఎం చేయాలని, అలా చేస్తే తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. పార్టీలో చాలా అవకాశాలు ఉన్నాయని, అందులో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.