హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన 15 మంది టీటీడీపీ నేతలు మంగళవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యా రు. టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, జూబ్లీహిల్స్ ఎన్నికపై చర్చించినట్టు తెలిసింది.