హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రం లో 42 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణ పనులపై చర్చించారు.
ఎస్సీఆర్కు నాలుగు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు ; రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ ఇంధన పరిరక్షణ అ వార్డులు దక్కాయి. ఢిల్లీలో ఈ నెల 14న జరిగిన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2025 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ అవార్డులు అందుకున్నట్టు మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ , రాయచూర్(రవాణా రంగం, రైల్వే స్టేషన్ రంగం), లింగంపల్లి రైల్వే స్టేషన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు.