కరీంనగర్ విద్యానగర్, అక్టోబర్ 27: కొందరు మంత్రులు మహిళా అధికారులను రాత్రి పూట ఇండ్లు, ఆఫీసులకు పిలిపించుకుని వేధిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వర్తిస్తున్న మహిళలను గౌరవించాల్సిందిపోయి అవమానిస్తారా? అంటూ మం డిపడ్డారు. సదరు మంత్రులను వెంటనే బర్తరఫ్ చేసి విచారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. సోమవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉకుపాదం మోపాలని సూచించారు.
మొన్న నిజామాబాద్‌లో ఎంఐఎం రౌడీషీటర్ కానిస్టేబుల్‌ను చంపగా.. నిన్న హైదరాబాద్‌లో డీసీపీ, కానిస్టేబుల్‌పై ఎంఐఎం రౌడీషీటర్ హత్యాయత్నం చేసినా కాంగ్రెస్ ప్రభు త్వం చేష్టలుడిగి చూస్తున్నదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో ఒక వర్గం ఓట్ల కోసం ఎంఐఎం కాళ్లు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందని విమర్శించారు. గోరక్షకులపై కాల్పులు జరిపి చం పేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తాము బాధిత పోలీసులను పరామర్శిస్తే, మజ్లిస్ నాయకులు రౌడీషీటర్లను పరామర్శిస్తూ వారికి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకనైనా కాంగ్రెస్ ఓట్ల రాజకీయం మానుకోవాలని.. డీసీపీ చైతన్యపై హత్యాయత్నం చేసిన రౌడీషీటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.